Crime News: జగిత్యాల జిల్లాలో దారుణాలు ఆగడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య మరువకముందే, జిల్లాలో మరో దారుణం జరిగింది. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, సింగిల్ విండో ఛైర్మన్ రాజానర్సింగ రావు తల్లి ప్రేమలతను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన రాజానర్సింగ రావు, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ముఖ్య అనుచరుడు. ఆయన తల్లి ప్రేమలతను దుండగులు బండరాయితో తలపై కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.
హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కక్షల వల్లే ఈ హత్య జరిగిందా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.