Fire Accident

Fire Accident: కోల్డ్ స్టోరేజ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం శివారులో గుబ్బ కోల్డ్ స్టోరేజ్ సెంటర్‌లో బుధవారం (ఆగస్టు 6) సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ఈ స్టోరేజ్‌ సెంటర్‌ గుబ్బ కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ ఆహార పదార్థాలు, విత్తనాలు, ఔషధాలు, వ్యాక్సిన్లు వంటి హీట్ సెన్సిటివ్ ఉత్పత్తులు నిల్వ చేయడం జరుగుతుంది.

ఒక్కసారిగా మంటలు..

ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. మంటలు గోడలపై నుంచి పైకెగిరి, స్టోరేజ్ సెంటర్ మొత్తం వ్యాపించాయి. ఇందులో విలువైన మిషన్లు, కూలింగ్ సిస్టమ్స్ పూర్తిగా కాలిపోయాయి.

ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణమేనా?

ప్రాథమిక సమాచారం మేరకు, ఈ అగ్నిప్రమాదానికి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Gold Rate Today: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు..హైదరాబాద్‌లో తులం గోల్డ్‌ ధర ఎంతంటే..

రాత్రంతా మంటలపై పోరాటం

జీడిమెట్ల, దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ల నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మొత్తం ఎనిమిది ఫైర్‌ ఇంజిన్లతో రాత్రంతా మంటలు అదుపు చేసేందుకు శ్రమించారు. కానీ రాత్రి 10 గంటల వరకూ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు.

బందోబస్తులో పోలీసులు

అగ్నిప్రమాదానికి తక్షణ సహాయ చర్యల కోసం ఎస్సై లక్ష్మీపతిరెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆస్తినష్టం భారీగానే ఉండే అవకాశం

ఈ ప్రమాదంలో పలు ఫార్మా కంపెనీల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలు పూర్తిగా కాలిపోయాయి. అయితే మొత్తం ఎంత ఆస్తినష్టం జరిగిందో ఇంకా లెక్కలు పూర్తి కావాల్సి ఉంది. గురువారం నాటికి పూర్తి వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *