Kochi ; పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్త మార్టిన్ ఇచ్చిన ఫిర్యాదును ప్రాధాన్యంగా తీసుకున్న కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. శ్వేతా మేన్ నటించిన కొన్ని సినిమాల్లోని అభ్యంతరకర సన్నివేశాలు, వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియ platformsలో చక్కర్లు కొడుతున్నట్టు మార్టిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మొదటగా ఈ అంశంపై మార్టిన్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు స్పందించలేదని సమాచారం. ఆపై ఆయన నేరుగా ఎర్నాకుళం కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం పోలీసులకు కేసు నమోదు చేసి విచారణ జరిపేలా ఆదేశాలు జారీ చేసింది.
“డబ్బు కోసం అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు” అనే ఆరోపణలను మార్టిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్వేతా మేన్ పాత్రలు సామాజిక విలువలకు విరుద్ధంగా ఉన్నాయని, యువతపై దుష్ప్రభావం చూపేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. శ్వేతా మేన్ నుంచి వివరణ తీసుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.