Supreme Court: ముంబైకి చెందిన ఒక యువజంట 18 నెలలు ముందు అందరి సమక్షంలో ఘనం గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తక్కువ కాలంలోనే వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. చివరకు విడాకులు కోరుతూ కోర్టులను ఆశ్రయించారు. ఈ కేసు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడంతో తీర్పు ద్వారా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
మొదట ఒప్పందం.. తర్వాత డబ్బు డిమాండ్!
ఈ కేసులో భార్య మొదట ఒక ఒప్పందంపై సంతకం చేసి, ముంబైలోని కల్పతరు హాబిటాట్ అపార్ట్‌మెంట్‌లో రెండు పార్కింగ్‌లు ఉన్న ఒక ఫ్లాట్‌ను పూర్తిస్థాయి పరిష్కారంగా అంగీకరించింది. కానీ తర్వాత ఆమె తన అభిప్రాయాన్ని మార్చి, రూ.12 కోట్లు నగదు, BMW కారు, ఇతర ఆర్థిక సహాయాల కోసం కోర్టును మరోసారి ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు కఠిన వ్యాఖ్యలు
ఈ డిమాండ్లపై స్పందించిన సుప్రీంకోర్టు, “ఇవి అనవసరం, మితిమీరినవి” అని అభిప్రాయపడింది. భార్య ఉన్నత విద్య చదివిన వ్యక్తి కాబట్టి, ఆమె తన జీవనాన్ని తానే గడపాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి గవాయ్ వ్యాఖ్యానించారు. “మీరు చదివారు, పనికి వెళ్లి సంపాదించండి. జీవితాన్ని ఇతరులపై ఆధారపడి గడపకండి” అని స్పష్టంగా చెప్పారు.
ఇది కూడా చదవండి: Kadapa Chetha Scam: వసూళ్లు కొండంత.. ఖజానాకు చేరేది గోరంత!
భర్త పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకున్నారు
కొందిరోజుల కిందట Citi Bank లో మంచి ఉద్యోగంలో సంవత్సరానికి రూ.2.5 కోట్లు సంపాదించిన భర్త, ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయి సంవత్సరానికి కేవలం రూ.18 లక్షలు మాత్రమే సంపాదిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. LinkedIn ప్రొఫైల్ ఉండడం మాత్రమే ఆధారంగా తీసుకొని అతను ఇంకా ఉద్యోగంలో ఉన్నట్లు భావించడం సరైంది కాదని కోర్టు స్పష్టం చేసింది.
తుది తీర్పు ఏమిటి?
సుప్రీంకోర్టు చివరకు వివాహాన్ని రద్దు చేస్తూ, ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు మంజూరు చేసింది. భార్యకు:
-
ముంబై ఫ్లాట్
-
ఫ్లాట్ భద్రత, నిర్వహణ కోసం రూ.25.9 లక్షల బకాయిలు
ఇవన్నీ భర్త చెల్లించాల్సిందిగా ఆదేశించింది. భర్త-భార్య ఇకపై ఒకరిపై ఒకరు కేసులు వేయరాదన్న నిబంధనను కూడా విధించింది.
“చదువున్నావు కదా, పని చెయ్యండి!” – సుప్రీంకోర్టు స్పష్టత
ఈ తీర్పులో ముఖ్యంగా మహిళ ఉన్నత విద్య చదివిందని, ఐటీ, మేనేజ్‌మెంట్‌లో అర్హతలు ఉన్నవారిగా పేర్కొంది. అలాంటి వ్యక్తి భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడం సరికాదని పేర్కొంది. “అలాంటప్పుడు చదువుకు విలువ ఏమిటి?” అని కోర్టు ప్రశ్నించింది.