Rajasaab

Rajasaab: రాజాసాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

Rajasaab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజాసాబ్’ సినిమా రిలీజ్ డేట్‌పై సందిగ్ధం నెలకొనగా, నిర్మాత విశ్వప్రసాద్ స్పష్టత ఇచ్చారు. హారర్, రొమాంటిక్, కామెడీ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. ఫస్ట్ గ్లిమ్స్‌కు భారీ స్పందన వచ్చిన నేపథ్యంలో, రిలీజ్ డేట్‌పై చర్చలు ఊపందుకున్నాయి. సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమా రిలీజ్ డిసెంబర్‌లోనా? లేదా జనవరిలో విడుదలవుతుందా?

Also Read: Deepika Padukone: దీపికా సోషల్ మీడియా రికార్డ్.. 190 కోట్ల వ్యూస్!

‘రాజాసాబ్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. నిర్మాత విశ్వప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో, సినిమా అక్టోబర్ నాటికి రెడీ అవుతుందని, డిసెంబర్ 5 లేదా 6న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే తెలుగు బయ్యర్స్ జనవరి 9న, హిందీ బయ్యర్స్ డిసెంబర్ 5న రిలీజ్ కోరుకుంటున్నారట. VFXలో ఎలాంటి రాజీ లేకుండా చిత్రీకరణ జరుగుతోందని, సాంగ్స్ షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉందని నిర్మాత తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *