Horoscope: ఆగస్టు 6, 2025 బుధవారం రోజున రాశిఫలాల ప్రకారం, మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీ ఆర్థిక స్థితి, ఉద్యోగ జీవితం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందో వివరంగా చూద్దాం.
మేష రాశి:
ఈ రోజు మీ రంగంలో మీరు మరింత శ్రమించాల్సి వస్తుంది. ఒక విషయంలో ఇతరుల నుంచి మాట పడాల్సి రావచ్చు, కానీ సహనం కోల్పోకుండా నిదానంగా వ్యవహరిస్తే అన్నీ చక్కబడతాయి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వద్దు. శనిధ్యానం మీకు మేలు చేస్తుంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొని ప్రత్యేక బాధ్యతలు చేపడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృషభ రాశి:
ప్రారంభించిన పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ఆర్థికంగా మీకు లాభం చేకూరుతుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. శివుడిని ఆరాధించడం మంచిది. ఉద్యోగంలో మీ హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
మిథున రాశి:
మీరు చేపట్టిన పనుల్లో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో మీ తెలివితేటలు బాగా పని చేస్తాయి. దుర్గా స్తోత్రం చదివితే మంచిది. ఇంటా బయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. కొత్త ప్రయత్నాలకు ఈ రోజు అనుకూల సమయం.
కర్కాటక రాశి:
ఈ రోజు గ్రహబలం తక్కువగా ఉంది. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయం మీకు ఉపయోగపడుతుంది. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మీకు శక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇతరులకు మీ ఆర్థిక బాధ్యతలను అప్పగించవద్దు.
సింహ రాశి:
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఆర్థికంగా ఇది మంచి సమయం. ఇష్ట దేవతను దర్శించడం ఉత్తమం. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది.
కన్య రాశి:
మీ రంగాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఈ రోజు సరైన సమయం. కొన్ని పరిస్థితులు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. శ్రీ లక్ష్మీదేవి దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలు పంచుకుంటారు. ఊహించని ప్రోత్సాహకాలు అందుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పరిష్కరించుకుంటారు. రావలసిన బాకీలు చేతికి అందుతాయి.
తుల రాశి:
ఈ రోజు ఒక శుభవార్త వింటారు. అవసరమైనప్పుడు డబ్బు అందుతుంది. బంధుమిత్రుల వల్ల మంచి జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మీకు మేలు చేస్తుంది. ఆర్థికంగా సంతృప్తికరమైన పరిస్థితి ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
వృశ్చిక రాశి:
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగించవచ్చు. తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైన పనులు, పెండింగ్ పనులు పూర్తవుతాయి.
ధనుస్సు రాశి:
ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు మీకు కీర్తిని తెస్తాయి. ఇష్ట దేవతా స్తోత్రం చదివితే మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్త.
మకర రాశి:
దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్ట దేవతా ఆరాధన శుభప్రదం. కుటుంబంలో చిన్న సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉన్నా, మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి.
కుంభ రాశి:
మీ రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. ఆనందంగా సమయాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. సూర్య ఆరాధన మీకు మేలు చేస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరిగినా, మంచి ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
మీన రాశి:
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం ఉత్తమం. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల వార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.