‘ఓకే శివయ్యా….’ అంటూ మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లడ్డూ తయారీ కోసం ఉపయోగించే నెయ్యిలో బీఫ్​కొవ్వు వాడినట్లు ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో నటుడు ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్‌ చేసిన పోస్ట్ పై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు చేశారు. ‘మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఇష్యూ ఇది. దర్యాప్తు చేయండి. నేరస్థులు దొరికితే కఠిన చర్యలు తీసుకోండి. అంతేగానీ ఎందుకు ఊహాగానాల్ని వ్యాప్తి చేస్తున్నారు?. కేంద్రంలో మీ స్నేహితుల వల్ల దేశంలో మనకున్న మతకల్లోలాలు చాలు’ అని ఎక్స్ లో పేర్కొన్నారు. దీంతో ఆయనపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. ‘ప్రకాశ్ రాజ్ గారూ.. తిరుమల లడ్డూ అంటే కేవలం ప్రసాదం కాదు. నాలాంటి కోట్లాదిమంది హిందువులకు ఓ నమ్మకం. దర్యాప్తు జరగాలంటూ పవన్ కళ్యాణ్‌ కరెక్ట్‌గా మాట్లాడారు. మతకల్లోలాల రంగు ఎవరు ఎక్కడ పులుముతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో’ అని సూచించారు. దీనికి స్పందించిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుకు ఆయన సినిమాలోని డైలాగ్ తోనే కౌంటర్ ఇచ్చారు. ‘ఓకే శివయ్యా.. నాకు నా దృక్కోణం ఉంటే మీకు మీ ఆలోచన ఉంటుంది. నోటెడ్.. జస్ట్ ఆస్కింగ్’ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా.. విష్ణు, ప్రకాశ్ ఇద్దరూ మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ పై విష్ణు విజయం సాధించి మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *