Udayabhanu

Udayabhanu: ఉదయభాను రీఎంట్రీ: ‘ఇస్కితడి ఉస్కితడి’ సాంగ్‌తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌

Udayabhanu: ఉదయభాను గురించి తెలుగు ఆడియన్స్ కి కొత్తగా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు.. స్మాల్ స్క్రీన్ లోనే సిల్వర్ స్క్రీన్ ని మించిన స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. జులాయి, లీడర్ మూవీస్ లో చేసిన స్పెషల్ సాంగ్స్ కి మంచి క్రేజ్ వచ్చింది.. లేట్ అయినా లేటెస్ట్ గా.. జస్ట్ టైమ్ గ్యాప్ అంతే అన్నట్టు.. త్రిబాణధారి బార్బరిక్ మూవీలో ఆమె స్టెప్పులేసిన ఇస్కితడి, ఉస్కితడి.. చేసేద్దాం దేత్తడి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది..

Also Read: Rajinikanth: సైమన్ ను ఆకాశానికెత్తేసిన దేవా

సీనియర్ యాక్టర్ సత్యరాజ్ మెయిన్ లీడ్ గా.. డైరెక్టర్ మారుతి టీమ్ ప్రొడక్షన్ లో.. మోహన్ శ్రీవత్స డైరెక్షన్లో.. మైథలాజికల్ టచ్ తో, ఓ కొత్త పాయింట్ తో రాబోతున్న మూవీ..త్రిబాణధారి బార్బరిక్.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఇస్కితడి, ఉస్కితడి అనే మాస్ నెంబర్ కి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది.. ఇన్ ఫ్యూజన్ బ్యాండ్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, రఘురామ్ లిరిక్స్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్ ఫుల్ జోష్ తో పాడాడు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఈ మాస్ సాంగ్ లో ఉదయభాను వేసిన ఎనర్జిటిక్ మూమెంట్స్ మాత్రం అదిరిపోయాయి.. ఈ సాంగ్ కి బి, సి, సెంటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం.. ఇందులో ఉదయభాను, పద్మక్క అనే పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించనుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *