Prabhas:‘సలార్, కల్కి2898ఎడి’ సక్సెస్ తో జోరుమీదున్న ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘పౌజీ’ చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ సినిమా ప్రకటించాడు. దాదాపు 8 భాషల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనపించబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా నటించబోతోందట. గతంలో ప్రభాస్, నయనతార జంటగా ‘యోగి’ సినిమాలో నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా మ్యూజికల్ హిట్ గా నిలవటమే కాదు ప్రభాస్, నయనతార జోడీ కెమిష్ట్రీ అదిరిందనే టాక్ వచ్చింది. ఇప్పుడు 17 ఏళ్ళ తర్వాత మరోసారి వీరిద్దరూ జోడీ కట్టబోతున్నారన్న మాట. ఇక ‘స్పిరిట్’ సినిమాను టీసీరీస్ సంస్థ నిర్మించనుంది. భూషణ్ కుమార్ నిర్మించే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలు పెట్టనున్నారు. మరి ఇన్నేళ్ళ తర్వాత మరోసారి జంటగా నటించబోతున్న ప్రభాస్, నయన్ మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి.
