Bhadrachalam:

Bhadrachalam: భ‌ద్రాచ‌లం ఆల‌య ఈవో బ‌దిలీ.. కొత్త ఈవోగా దామోద‌ర్‌రావు

Bhadrachalam: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని భ‌ద్రాచ‌లం సీతారామ‌చంద్ర స్వామి ఆల‌య‌ ఈవో ఎల్ ర‌మాదేవి బ‌దిలీ అయ్యారు. ఆమెకు స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా ప్ర‌మోష‌న్ ల‌భించింది. ఆమె స్థానంలో భ‌ద్రాచ‌లం ఆర్డీవోగా ప‌నిచేసిన దామోద‌ర్‌రావును నూత‌న‌ ఈవోగా నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.

Bhadrachalam: 2023 ఫిబ్ర‌వ‌రి 16న భ‌ద్రాచ‌ల రామాల‌యం ఈవోగా ఎల్‌ ర‌మాదేవి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆనాటి నుంచి ఆరు నెల‌ల్లోనే ఎన్నో విభాగాల్లో ప్ర‌క్షాళ‌న చర్య‌లు చేప‌ట్టారు. ముక్కుసూటిగా వ్య‌వ‌హారిస్తూ వ‌చ్చారు. ఆల‌య భూముల ర‌క్ష‌ణ కోసం ఆమె అనేక చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆన్‌లైన్ సేవ‌ల‌ను అన్ని విభాగాల్లో తీసుకొచ్చారు. అవినీతిని అరిక‌ట్టి ఆల‌య ఆదాయం నెల‌కు రూ.కోటికి పైగా వ‌చ్చేలా చొర‌వ తీసుకున్నారు.

Bhadrachalam: ఈ ద‌శ‌లో కొంత‌కాలం త‌ర్వాత‌ ఆమెను బ‌దిలీ చేశారు. ఈ స‌మయంలో భ‌క్తులు, స్థానికులు, కొంద‌రు నాయ‌కులు ఆమె బ‌దిలీని ర‌ద్దు చేయాల‌ని ఆందోళ‌నకు దిగారు. దీంతో ఆమె బ‌దిలీని ప్ర‌భుత్వం నిలిపివేసింది. ఇప్ప‌టి వ‌రకూ ఆమె కొన‌సాగారు. ఇటీవ‌ల ఆల‌య భూముల ర‌క్ష‌ణ విష‌యంలో క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌వేక్షిస్తుండగా, కొంద‌రు ఆమెపై దాడికి పాల్పడ్డారు. తాజాగా ఆమెకు ప్ర‌మోష‌న్ క‌ల్పించ‌డంతో బ‌దిలీపై వెళ్లాల్సి వ‌చ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *