Hyderabad:హైదరాబాద్ నగరంలో పనిచేసే ఐటీ ఉద్యోగులకు ఆందోళన కలిగించే అంశం. వారి కుటుంబాల గుండె గుబిల్లుమనే వార్త ఇది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించిన ఆ కీలక అంశాలు హెచ్చరికగా భావించవచ్చు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో 84 శాతం మంది ఫ్యాటీలివర్ సమస్యలతో బాధపడుతున్నట్టు మంత్రి జేపీ నడ్డా హెచ్చరించారు.
Hyderabad:అదే విధంగా 71 శాతం మంది ఊబకాయం, 34 శాతం మంది మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలతో బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తన నివేదికలో వెల్లడించారు. వీటివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటిస్, లివర్ పాడయ్యే ప్రమాదాలు పొంచి ఉన్నదని వైద్యులు చెప్పినట్టు హెచ్చరించారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, జంక్, ఫాస్ట్‌ఫుడ్, అధిక ఒత్తిడి ఆయా సమస్యలకు కారణాలుగా పేర్కొన్నారని తెలిపారు.