Damodar rajanarsimha: తల్లితనాన్ని ఆశగా ఎదురు చూస్తున్న దంపతుల భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని, ఐవీఎఫ్ (IVF), సరోగసి ప్రక్రియలను వ్యాపారంగా మార్చి దందాకు పాల్పడుతున్న ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశించారు.
“సృష్టి” తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని స్పష్టం చేస్తూ, రాష్ట్రంలో ప్రైవేటు ఐవీఎఫ్ కేంద్రాల కార్యకలాపాలపై సంపూర్ణ నియంత్రణ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీని ఆదేశించిన మంత్రి, ప్రత్యేక కమిటీ నియామకాన్ని సూచించారు.
✅ కమిటీ ఏర్పాటు:
కమిషనర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు.
సభ్యులుగా ఆరోగ్యశ్రీ సీఈవో, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్.
కమిటీకి తక్షణమే అన్ని ప్రైవేట్ ఐవీఎఫ్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు.
🔍 తనిఖీల్లో పరిశీలించవలసిన అంశాలు:
అనుమతులు మరియు రిజిస్ట్రేషన్ల వ్యాలిడిటీ.
గతంలో నమోదు అయిన కేసుల సమాచారం.
నిబంధనలు ఉల్లంఘించిన వివరాల సేకరణ.
ఈ తనిఖీ ప్రక్రియను 10 రోజుల్లో పూర్తిచేసి నివేదిక అందించాలంటూ ప్రభుత్వం స్పష్టమైన గడువు విధించింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజల మద్దతుతో పాటు బాధితుల న్యాయానికీ దోహదం చేస్తాయని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి.

