Operation Muskaan: తెలంగాణలో పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. 2025 జూలై 1 నుంచి అదే నెల 31 వరకు చేపట్టిన కార్యక్రమంలో 7,678 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. నెలరోజుల పాటు దుర్భలమైన, దోపిడీ పరిస్థితుల నుంచి ఆ చిన్నారులంతా రక్షించబడ్డారు. ఈ కార్యక్రమంలో 121 పోలీస్ సబ్ డివిజన్లకు చెందిన 786 మంది పోలీసు బృందాలు పాల్గొన్నాయి.
Operation Muskaan: పోలీసులు రక్షించిన చిన్నారుల్లో 7,149 మంది బాలురు ఉండగా, 529 మంది బాలికలు ఉన్నారు. వీరిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 3,783 మంది ఉండగా, నేపాల్‌కు చెందిన నలుగురు ఉన్నారు. 357 మంది వీధి బాలలు ఉండగా, 42 మంది యాచక వృత్తి పనులు చేసే చిన్నారులు ఉన్నారు.
Operation Muskaan: ఇప్పటి వరకు 1,713 కేసులను ఈ పోలీసు బృందాలు నమోదు చేశాయి. 1,718 మంది నిందితులను వారు అరెస్టు చేశారు. 6,593 మంది పిల్లలను ఇప్పటికే వారి కుటుంబాలకు పోలీసులు అప్పగించడం విశేషం. 1,049 మంది చిన్నారులను రెస్క్యూ హోంకు పోలీసులు తరలించారు. ఆయా విషయాలను ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా వెల్లడించారు.