Sitaare Zameen Par: అమీర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా యూట్యూబ్‌లో విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జూన్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను వదిలి, నేరుగా యూట్యూబ్‌లో రూ. 100 చెల్లించి చూసే విధానంతో అందుబాటులోకి వచ్చింది. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, బాస్కెట్‌బాల్ కోచ్‌గా అమీర్ ఖాన్, మానసిక సవాళ్లు ఎదుర్కొంటున్న ఆటగాళ్ల ప్రయాణాన్ని చూపిస్తుంది. జెనీలియా దేశ్‌ముఖ్ కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం భారత్‌తో పాటు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ అందుబాటులో ఉంది.
