Magadheera: తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన మగధీర సినిమా 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ నటనతో ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఎన్నో వసూళ్ల రికార్డులు సృష్టించి, అవార్డులను కైవసం చేసుకుంది.
Also Read: Kingdom Twitter Review: హిట్ కొట్టిన విజయ్.. ‘కింగ్డమ్’ ట్విటర్ రివ్యూ
వాయిస్ ఓవర్: 2009 జులై 31న విడుదలైన మగధీర సినిమా తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. దాదాపు 44 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు రూ.15 కోట్ల షేర్, ఫుల్ రన్‌లో రూ.77.96 కోట్ల షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. గ్రాస్ లెక్కల్లో దాదాపు రూ.140 కోట్లు దాకా రాబట్టి ఇండస్ట్రీ హిట్ అయ్యి చరిత్ర సృష్టించింది. ఇక జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నృత్య దర్శకత్వం, స్పెషల్ ఎఫెక్ట్స్‌తో పాటు, రామ్ చరణ్‌కు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, రాధాకృష్ణకు ఉత్తమ ఆడియోగ్రాఫర్ నంది అవార్డు లభించాయి.

