YCP Den 11 Crores Story

YCP Den 11 Crores Story: ఏ ధైర్యంతో రెచ్చిపోయారో దానిపైనే దెబ్బకొట్టిన సిట్‌

YCP Den 11 Crores Story: ఏపీలో వైసీపీ లిక్కర్‌ స్కాం పుట్టలు పగులుతున్నాయి. ఫార్మ్‌ హౌస్‌ల నుంచి కట్టల పాములు బయటకొస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ఫార్మ్‌ హౌస్‌లో దాచి పెట్టిన లిక్కర్‌ ముడుపుల సొమ్ము 11 కోట్ల రూపాయల్ని సిట్‌ స్వాధీనం చేసుకుంది. ఫార్మ్‌హౌస్‌ స్టోర్‌ రూంలో 12 అట్టపెట్టెల్లో బయటపడ్డ 11 కోట్ల రూపాయల నోట్ల కట్టలు చూస్తుంటే.. లిక్కర్‌లో వీరి అవినీతి సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఏడాదిగా ఆ సొమ్ము అక్కడే మగ్గిపోతోందట. ప్రజల కాలేయాలు, కిడ్నీలు పాడుబెట్టి సంపాదించిన పాపపు సొమ్ము.. ఎక్కడెక్కడ పెట్టారో తమకే గుర్తులేనంత స్థాయికి ఈ లిక్కర్‌ గ్యాంగ్‌ ఎదిగిపోయిందనమాట.

ఈ 11 కోట్ల నోట్ల కట్టలు బయటపడటం వెనక చాలా పెద్ద కథే ఉందని సిట్‌ వర్గాలు అంటున్నాయి. డబ్బు దొరికింది వర్థమాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ సమీపంలోని సులోచన ఫార్మ్‌హౌస్‌లో. ఇప్పటి వరకూ గుర్తించింది 7 డెన్‌లు అయితే.. ఇది డెన్‌ నంబర్‌ 8. ఈ సమాచారం ఇచ్చింది వరణ్‌ కుమార్‌ అనే పర్సన్‌. ఇతను లిక్కర్‌ కేసులో అక్యూస్డ్ నంబర్‌ 40. లీలా డిస్టలరీస్‌కు ఆపరేషన్స్‌ హెడ్‌ కూడా. కనీస మౌలిక సదుపాయాలు లేని లీలా డిస్టలరీస్‌కు 452 కోట్ల ఆర్డలు ఇచ్చింది జగన్‌ ప్రభుత్వం. 20 పర్సెంటో, 30 పర్సెంటో తీసుకునే ముడుపులు కాకుండా, మొత్తం 452 కోట్లు స్కామ్‌ జరిగే విధంగా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ డబ్బు లీలా డిస్టలరీస్‌ నుండి వివిధ అకౌంట్లలోకి మళ్లించారు. ఇంకా హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో ఈ లిక్కర్‌ కట్టల డెన్లు ఉన్నట్లు సిట్‌ అధికారులు అనుమానిస్తున్నారు.

Also Read: UPI Payments: UPI పాస్వర్డ్ మర్చిపోయారా.. ఇక మీద కళ్లతో పేమెంట్ చేయండి

ఇప్పటిదాకా వైసీపీ లిక్కర్‌ డాన్లు బంగారం రూపంలో, బిట్‌ కాయిన్ల రూపంలో, హవాలా రూపంలో, ఇలా రకరకాల పద్ధతుల్లో ముడుపులు తీసుకున్నారని మాత్రమే బయటకొచ్చింది. ఎక్కడా నగదు పట్టబడలేదు. గతంలో చెవిరెడ్డికి సంబంధించిన వాహనంలో 8 కోట్లు పట్టుబడితే.. అవి మావి కావు అనేశారు. అయితే లిక్కర్‌ స్కామ్‌లో దోచుకున్న డబ్బుతో సినిమాలు తీయడం, ఎన్నికల్లో ఖర్చుపెట్టడం వంటి పనులు చేశారు. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న అంశాలను పరిశీలిస్తే.. ఈ లిక్కర్‌ మనీని హాస్పిటల్స్‌లో కూడా పెట్టుబడి పెట్టారా అన్న అనుమానం వస్తోంది. ఇది అర్థం కావాలంటే రాజ్‌ కసిరెడ్డి తీసిన ”స్పై” సినిమాతో మొదలు పెట్టాలి. ఈ “స్పై” సినిమా తీసింది రాజ్‌ కసిరెడ్డి నెలకొల్పిన ED ఎంటర్‌టైన్మెంట్స్‌. ఇందులో E అంటే ఈషా ఇన్‌ఫ్రా, D అంటే దివ్య రెడ్డి. ఈ దివ్యారెడ్డి ఎవరో కాదు.. రాజ్‌ కసిరెడ్డి భార్య. ఆమెకు ED ఎంటర్‌టైన్మెంట్స్‌తో పాటూ మరో యాపారం కూడా ఉందండోయ్‌. హైదరాబాద్‌లోని ఫేమస్‌ అరెట్‌ హాస్పిటల్స్‌ డైరెక్టర్లలో ఈ దివ్యారెడ్డి కూడా ఒకరు. మరో డైరెక్టర్‌ విజయేందర్‌ రెడ్డి. ఈయన డెన్‌లోనే తాజాగా 11 కోట్ల నగదు పట్టుకున్నారు. అంటే లిక్కర్‌ సొమ్ములను అరెట్‌ హాస్పిటల్స్‌లో కూడా పెట్టుబడి పెట్టారా అన్న కోణంలో ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తోంది.

చెవిరెడ్డి వాహనంలో పట్టుబడ్డ 8 కోట్లు, బ్యాంక్‌ ఖాతాల నుండి సిట్‌ జప్తు చేసిన 65 కోట్లు, ఇప్పుడు నోట్ల కట్టల రూపంలో దొరికిన 11 కోట్లు. ఎవడబ్బ సొమ్ము ఇదంతా? జే బ్రాండ్‌ లిక్కర్‌తో మందుబాబుల కిడ్నీలు, కాలేయాలు కుళ్లబెట్టి, వారి శరీరాలను పీల్చి పిప్పి చేసి దోచుకున్న డబ్బు కాదా? ఆ మధ్య వైసీపీలో అందరికన్నా మేధావి అయిన సజ్జల.. అసలు స్కామే లేదని బొంకారు. “స్కామ్‌ చేశాం… కానీ ఎక్కడా ఏ లూప్‌ హోల్‌ లేకుండా జాగ్రత్త పడ్డాం. ప్రపంచంలోనే ఇన్ని తెలివితేటలతో ఎవరూ స్కామ్‌ చేసి ఉండరు. ఇంక మమ్మల్ని పట్టుకునేది ఎవరు?” అనేదే బహుషా ఆయన ధైర్యం అయ్యిండొచ్చు. అసలు స్కామే లేదని వైసీపీ చేస్తున్న వాదనకు మూలం కూడా ఇదే. అందుకే సజ్జల ఏం ఆధారముందని సిట్‌ ఈ కేసులో ముందుకెళ్తుందని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయనకు ఈ 11 కోట్లు ఆధారంగా సరిపోతాయో, లేదంటే ముడుపుల మొత్తం 3,500 కోట్లూ తెచ్చి చూపించమంటారో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *