Leopard: హైదరాబాద్ మహానగరంలో గత 20 రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో తప్పించుకొని తిరుగుతున్న ఆ చిరుత.. తరచూ స్థానికుల కంటపడుతూ ఆందోళనకు గురిచేసింది. గుట్టల ప్రాంతాల్లో తలదాచుకుంటూ ఉన్న ఆ చిరుత కోసం అటవీ శాఖ అధికారులు వలవేసి పట్టుకున్నారు.
Leopard: మంచిరేవుల ఈకోటిక్ పార్కు వద్ద మదుగులో (చెట్లు ఉన్న ప్రాంతం) ఏర్పాటు చేసిన బోనులో ఆ చిరుత చిక్కింది. దీంతో దానిని అటవీశాఖ అధికారులు బంధించి.. దానిని అటవీ ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు. 20 రోజులుగా అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. ఇటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. చివరకు బోనులో చిక్కడంతో అటు అధికారులు, ఇటు ప్రజాలు ఊపిరి పీల్చుకున్నారు.