Jagan Alert

Jagan Alert: ఈ ఆరాటమంతా సతీమణిని తప్పించేందుకేనా?

Jagan Alert: జగన్‌ ఎందుకు సతీసమేతంగా గవర్నర్‌ని కలిశారు? ఈ సమయంలో ఢిల్లీ పర్యటనకు ఎందుకు ప్లాన్‌ చేశారు? బెంగళూరు ప్యాలెస్‌లో రోజుల తరబడి ఎవరితో చర్చలు? న్యాయ నిపుణలతో దేనికోసం చర్చలు జరుపుతున్నారు? తన పార్టీలో కీలక నేతలకు ఏం ఆదేశాలిస్తున్నారు? లిక్కర్‌ స్కామ్‌ కేసులో భారతి సిమెంట్స్‌లో సిట్‌ సోదాలు జరపడంతో జగన్‌ అలర్ట్‌ అయ్యారా? లిక్కర్‌ స్కామ్‌లో జగన్‌, భారతిల పేర్లు చేరుస్తారా? జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా అరెస్ట్‌కి సిద్ధమవుతున్నారా? ఈ ఆరాటమంతా సతీమణి భారతిని అరెస్టు నుండి తప్పించేందుకేనా? ఆర్టికల్‌ 17(ఏ) ద్వారా రక్షణ పొందేందుకే గవర్నర్‌ని కలిశారా? కేంద్ర ప్రభుత్వ పెద్దలని సహాయం అర్థించేందుకే ఢిల్లీ పర్యటనా? మోడీ, అమిత్‌ షాలు ఈసారి కూడా జగన్‌ని వెనకేసుకొస్తారా? బీజేపీ హెల్ప్‌ దొరకని పక్షంలో జగన్‌ ఎలాంటి స్టెప్‌ తీసుకోబోతున్నారు? తాను అరెస్ట్‌ అవ్వాల్సి వస్తే తన పార్టీ పది మంది ఎమ్మెల్యేలతో రిజైన్‌ చేయిస్తారా? ఉప ఎన్నికలు వస్తే పులివెందులలోనైనా గెలిచే సీన్‌ ఉంటుందా?
జగన్‌ని నమ్మి రాజీనామా చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ముందుకొస్తారా? అసలు వైసీపీలో, తాడేపల్లి ప్యాలెస్‌లో ఏం జరగుతోంది?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, భార్య భారతితో కలిసి గవర్నర్‌ను కలవడం, ఢిల్లీ పర్యటన, బెంగళూరులో న్యాయ నిపుణులతో చర్చలు.. ఇవన్నీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. రూ.3,200 కోట్ల లిక్కర్ స్కామ్‌లో భారతి సిమెంట్‌ యజమాని, జగన్‌ సతీమణి భారతి రెడ్డి హస్తం ఉన్నట్లు, అంతిమ లబ్ధిదారుడు జగనే అని ఆరోపణలు ఉన్నాయి. భారతి సిమెంట్స్‌లో సిట్‌ జరిపిన సోదాల్లో భారీగా బినామీ ఆస్తులు, హవాలా లావాదేవీలు బయటపడ్డాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్.. రాష్ట్ర గవర్నర్‌ను కలిసి, ఆర్టికల్ 17(ఏ) ద్వారా రక్షణ పొందే ప్రయత్నంలో ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు ప్యాలెస్‌లో జగన్ న్యాయ నిపుణులతో రహస్య చర్చలు జరుపుతున్నారనీ, లిక్కర్ స్కామ్‌లో తనను, భారతిని తప్పించేందుకు వ్యూహాలు రచిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పర్యటన ద్వారా కేంద్రంలోని బీజేపీ పెద్దలు మోదీ, అమిత్ షాలను కలిసి సహాయం కోరాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, గతంలో జగన్‌కు బీజేపీ సహకారం లభించినా, ఈసారి ఆ పార్టీ మద్దతు దొరకకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Also Read: Cycle vs Car: కేటీఆర్‌ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌కు గుదిబండగా మారాయా?

తాజాగా వైసీపీలో అసంతృప్తి నేతలను జగన్ బుజ్జగించే ప్రయత్నాలూ చేస్తున్నారట. తాను అరెస్ట్‌ అయితే అందరూ తనకు అండగా నిలబడాలని కోరుతున్నారట. అరెస్ట్‌ భయం నేపథ్యంలో, పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి, ఉప ఎన్నికల ద్వారా ప్రజాసానుభూతి పొందాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఎమ్మెల్యేలు జగన్‌ను నమ్మి రాజీనామా చేసేందుకు ముందుకొస్తారా అనే సందేహం నెలకొంది. ఒక వేళ ఉప ఎన్నికల్లో పులివెందులలో జగన్ గెలిచినా, మిగతా 10 నియోజకవర్గాల్లో వైసీపీ మెజార్టీ స్థానాలు కోల్పోవడం గ్యారెంటీ.

లిక్కర్ స్కామ్‌లో జగన్, భారతి అరెస్టయితే రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. జగన్ తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాజకీయ, చట్టపరమైన వ్యూహాలతో పాటు కేంద్రంతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ… బీజేపీ సహకారం అందకపోతే, జగన్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఈ సంక్షోభం జగన్‌ను, వైసీపీని రాజకీయంగా భూస్థాపితం చేసే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *