Nara Lokesh: సింగపూర్ పర్యటనలో భాగంగా నాలుగో రోజు ముఖ్యమైన టెక్నాలజీ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ మంత్రి నారా లోకేష్ గారు మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను చూసారు. సెసిల్ స్ట్రీట్లో ఉన్న ఈ కేంద్రంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆరోగ్య రంగం, ఫైనాన్షియల్ సర్వీసెస్, తయారీ పరిశ్రమలు, వినియోగదారుల సేవల వంటి అనేక విభాగాల్లో ఏఐ ఎలా పనిచేస్తోందో చూడగలిగారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోస్టోర్లో టెక్నాలజీ వినియోగాన్ని ప్రదర్శించారు.
అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉన్న కీలక వ్యక్తులు మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మార్కస్ లోహ్, సెలా హెడ్ జాస్మిన్ బేగం, సిటిఓ మార్క్ సౌజాలతో సమావేశమయ్యారు.
ఇది కూడా చదవండి: Chandrababu: సోనూ సూద్ పై సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్.. నెట్టింటా వైరల్!
ఈ సమావేశంలో మంత్రిగారు ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ లేదా టెక్నాలజీ స్టేషన్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి లోని క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్లో మైక్రోసాఫ్ట్ యొక్క అజూర్ ఓపెన్ఏఐ మరియు కోపైలట్ వంటి సేవలను ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడే పరిష్కారాలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, 2026లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఒక హ్యాకథాన్ నిర్వహించాలని కూడా మంత్రిగారు ప్రతిపాదించారు. ఈ హ్యాకథాన్ ద్వారా యువతకు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతోపాటు, కొత్త ఆవిష్కరణలకు దారి తెరవగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
#APatSingapore
సింగపూర్ పర్యటనలో నాలుగో రోజు సెసిల్ స్ట్రీట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను సందర్శించాను. అక్కడ ఏఐ గోస్టోర్ లోని వివిధ పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎస్ఐ, తయారీ, వినియోగదారు పరిశ్రమల్లో ఏఐ వినియోగ దృశ్యాలను పరిశీలించాను. అనంతరం మైక్రోసాఫ్ట్… pic.twitter.com/utphuKlNmi— Lokesh Nara (@naralokesh) July 30, 2025