Seethakka

Seethakka: కేటీఆర్‌కు మంత్రి సీతక్క సవాల్‌

Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంచలన సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కయ్యారని వస్తున్న ఆరోపణలపై కేటీఆర్ స్పష్టత ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు.

సీఎం రమేష్ ఇంటికి వెళ్లడంపై ఎందుకు మౌనం?
“కేటీఆర్, సీఎం రమేష్ ఇంటికి వెళ్లిన విషయంపై ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు?” అని మంత్రి సీతక్క నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కేటీఆర్, బీజేపీ నేత సీఎం రమేష్ ఇంటికి వెళ్లారనే ప్రచారం జరిగింది. దీనిపై కేటీఆర్ స్పందించాలని సీతక్క కోరారు.

బీజేపీతో కుమ్మక్కు కాలేదని ఎందుకు చెప్పడం లేదు?
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు కాలేదని కేటీఆర్ ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదని సీతక్క ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల శాతం తేడా చాలా తక్కువగా ఉండగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి ఎలా వెళ్లాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. “కేటీఆర్ గుండెపై చేయివేసుకొని ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలి,” అని సీతక్క సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *