Australia Cricket: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. జూలై 29, 2025న జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఒక అరుదైన ఘనతను సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఒక పూర్తి సభ్య దేశాన్ని 5-0తో వైట్‌వాష్ చేసిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. అంతకుముందు టెస్ట్ సిరీస్‌లో కూడా 3-0తో గెలిచి, మొత్తంగా ఈ కరీబియన్ పర్యటనను 8-0తో అజేయంగా ముగించింది.
ఐదో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 19.4 ఓవర్లలో 170 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్ (52), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (35) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షూయిస్ మూడు వికెట్లు తీయగా, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు పడగొట్టాడు. అదనంగా, ఆడమ్ జంపా తన 100వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో 1 వికెట్ తీశాడు.
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలో తడబాటు ఎదురైనా, మిచెల్ ఓవెన్ (37), కామెరూన్ గ్రీన్ (32), టిమ్ డేవిడ్ (30) మెరుపులు మెరిపించారు. చివరకు ఆరోన్ హార్డీ అజేయంగా 28 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్ మూడు వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ, 5-0తో సిరీస్ గెలుస్తామని ఊహించలేదని, అయితే జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కామెరూన్ గ్రీన్ నిలిచాడు.