Crime News: ఇదో రకమైన సంఘటన. ప్రేమ విషయంలో ఏర్పడిన వివాదాలు.. చివరికి ఓ యువతి ప్రాణంమీదికి వచ్చింది. యువతీ, యువకుడి ప్రేమ వ్యవహారంలో ఇరు కుటుంబాలకు ఇష్టంలేక, పంచాయితీలు నడిచాయి. అయినా తరచూ ఫోన్ మాట్లాడుకుంటుండటంతో ఆ యువతి సోదరుడు తన అక్కను దారుణంగా హత్య చేశాడు.
Crime News: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన రాఘవేందర్, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. డిగ్రీ పూర్తిచేసి ఎంబీఏ అడ్మిషన్ కోసం వారి పెద్ద కూతురు రుచిత (21) ఎదురు చూస్తున్నది. గత కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో రుచిత మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. ఈ విషయంలో ఇరు కుటుంబాల నడుమ పంచాయితీలు నడిచాయి. అనేక సార్లు గొడవలు అయ్యాయి. పంచాయితీ సందర్భంగా ఇక నుంచి మాట్లాడుకోమని ఆ యువతి, యువకుడు చెప్పారు.
Crime News: మళ్లీ అదే యువకుడితో రుచిత తరచూ మాట్లాడుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు మందలించారు. ముఖ్యంగా ఆమె తమ్ముడు రోహిత్ (20) ఫోన్లో ఆమె ప్రియుడితో మాట్లాడవద్దని హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో ఆవేశంతో వైరుతో గొంతుకు బిగించడంతో ఊపిరాడక రుచిత ప్రాణాలిడిసింది. రుచిత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.