Sandeep Kishan: గతంలో నితిన్ హీరోగా ప్లాన్ అయిన ‘పవర్ పేట’ సినిమా కొన్ని కారణాల వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో దర్శకుడు కృష్ణ చైతన్య ఈ ప్రాజెక్ట్‌ను యంగ్ హీరో సందీప్ కిషన్‌తో మళ్లీ పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. కథలో కొన్ని కీలక మార్పులతో ఈ చిత్రం ఇప్పుడు కొత్త రూపం సంతరించుకుంది. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 9న ఈ సినిమా షూటింగ్ గ్రాండ్‌గా స్టార్ట్ కానుంది. గతంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో విశ్వక్ సేన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రజెంట్ చేసిన కృష్ణ చైతన్య, ఈసారి సందీప్ కిషన్‌తో మరో హిట్ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.