Megastar-Bobby: మెగాస్టార్ కెరీర్‌లో వాల్తేరు వీరయ్య ఓ సంచలన విజయం. రవితేజతో కలిసి మెప్పించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా సూపర్ హిట్‌గా నిలిచింది. చిరు లోని వింటేజ్ మాస్ హంగులను తెరపై ఆవిష్కరించిన బాబీ, మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం చిరు విశ్వంభర, అనిల్ రావిపూడి చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్‌ల తర్వాత బాబీతో కొత్త సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్‌లో పట్టాలెక్కనుంది. ఇటీవల డాకు మహారాజ్‌తో సక్సెస్ అందుకున్న బాబీ, చిరుతో మరో హిట్ కోసం జోష్‌లో ఉన్నాడు.

