Rajanna Sircilla: వానకాలం వడ్లు కోతకొచ్చాయి.. అమ్మకానికి కల్లాల్లోకి తరలించారు.. తీరా కొనుగోళ్లు లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తెలంగాణలో పలుచోట్ల చోటుచేసుకుంటున్నారు. ఆదివారం తమ వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
