Devara OTT Release Date: ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో వచ్చిన ‘దేవర’ చిత్రం సూపర్ హిట్ అవటమే కాదు సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో రికార్డ్ వసూళ్ళను సాధించింది. 400 కోట్లకు పైగా వసూళ్ళను సాధించిన ‘దేవర’ రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేయటమే కాదు కొరటాలకు కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. శ్రీదేవి తనయ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘దేవర’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు వీక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
ఇది కూడా చదవండి: Mirai: ‘మిరాయి’ లో నిధి అగర్వాల్ పాట..
Devara OTT Release Date: ఒప్పందానికి అనుగుణంగానే ఆరు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనుంది. నవంబర్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తారట. ‘దేవర’ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మించారు. ఇక ‘దేవర2’ షూటింగ్ ను వచ్చే ఏడాది ప్రారంభిస్తారట. టాక్ కి అతీతంగా థియేటర్లలో సందడి చేసిన ‘దేవర’ ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటాడో చూద్దాం.