Bandaru Toli Adugu: ఏమ్మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పింఛన్ కరెక్టుగా వస్తోందా? ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ పథకం కూడా తీసుకుని వస్తోంది. సంతోషమేనా? అంతా బాగున్నట్లేనా? అని ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకుంటున్నారు కొత్త పేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఆయన తొలి అడుగుతో జత కలుస్తూ.. మరో ముందడుగు వేసింది మహాన్యూస్. ఎమ్మెల్యేని ప్రజల మధ్య నిలుచోబెట్టి… ప్రజా సమస్యల్ని ఆయన ముందే ఆరా తీసే ప్రయత్నం చేసింది. సంక్షేమ పథకాల విషయంలో అంతా హ్యాపీసే అంటున్న ప్రజలు… అభివృద్ధి విషయంలో మాత్రం ఫుల్ హ్యాపీస్గా లేరని మహాన్యూస్ ప్రయత్నంలో ఎమ్మెల్యే దృష్టికొచ్చింది. ఎమ్మెల్యే కష్టపడుతున్నారని కితాబిస్తూనే.. మాకు రోడ్డు బాగో లేదయ్యా, మా కాలనీలో డ్రైనీజీ ప్రాబ్లం ఉందయ్యా.. అంటూ తమ సమస్యల్ని ఎమ్మెల్యేకి చెప్పుకున్నారు. అంటే… గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని కొత్త పేటని.. తిరిగి బాగు చేయాలంటే.. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మిగతా నాలుగేళ్లు కష్టపడి పనిచేయాల్సిందేనన్న విషయం అర్థమౌతోంది.
Also Read: Hyderabad: లిక్కర్ స్కాంలో భారతి సిమెంట్ పై సిట్ అధికారుల సోదాలు
ప్రజా సమస్యలపై ప్రజల సమక్షంలోనే ఎమ్మెల్యేని ప్రశ్నించింది మహాన్యూస్. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ప్రజలకు ఎమ్మెల్యే వివరించడం జరిగింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటి సమస్యనీ తన సమస్యలా భావించి, సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చే పనిలో తలమునకలై ఉన్నారు. అదే విధంగా ఏడాదిలో కూటమి సుపరిపాలన ఫలాలు కొత్తపేటలోనూ కనిపిస్తున్నాయి. అయితే తొలి అడుగు కార్యక్రమంలో అనేక సమస్యలు కూడా ఎమ్మెల్యే దృష్టికొస్తున్నాయి. వాటన్నింటినీ త్వరలోనే పరిష్కారం చేస్తానని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే.. తీర్చేందుకే తాను ఇక్కడ ఉన్నానని, ప్రజలకు అత్యంత భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.