Karnataka Politics:

Karnataka Politics: ఢిల్లీలో కొట్టుకున్న క‌ర్ణాట‌క సీఎం, డిప్యూటీ సీఎం వ‌ర్గాల అధికారులు

Karnataka Politics:ఢిల్లీలోని క‌ర్ణాట‌క భ‌వన్‌లో ఆ రాష్ట్ర సీఎం సిద్ధ‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ వ‌ర్గాల అధికారులు ఏకంగా కొట్టుకున్న‌ట్టు వార్త‌లు బ‌య‌ట‌కు పొక్కాయి. రెండు వ‌ర్గాల అధికారులు బూట్ల‌తో కొట్టుకున్న‌ట్టు తెలిసింది. క‌ర్ణాట‌క భ‌వ‌న్‌లో సీఎం సిద్ధ‌రామ‌య్య పేషీలోని ప్ర‌త్యేక అధికారి, అసిస్టెంట్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ సీ మోహ‌న్‌కుమార్.. త‌న‌పై బూటుతో దాడి చేశాడ‌ని డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ పేషీలోని ప్ర‌త్యేక అధికారి హెచ్ ఆంజ‌నేయ ఫిర్యాదు చేశారు.

Karnataka Politics:ఇరువ‌ర్గాల అధికారులు బూట్ల‌తో కొట్టుకున్న విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని ఢిల్లీ క‌ర్ణాట‌క భ‌వన్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ జ‌మీర్ మీడియాకు తెలిపారు. వాస్త‌వంగా సీఎం సిద్ధ‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ మ‌ధ్య సీఎం ప‌ద‌విపై తొలినాళ్ల నుంచి ఉన్న వైరం ఇలా వారి వ‌ర్గ‌పు అధికారుల మ‌ధ్య పెచ్ఛ‌రిల్ల‌డం క‌ర్ణాట‌క రాష్ట్రంలో తీవ్ర‌మైన చ‌ర్చ‌కు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *