Actor Sonu Sood:

Actor Sonu Sood: ఫిష్ వెంక‌ట్ కుటుంబానికి సోనూసూద్ ఆప‌న్న‌హ‌స్తం

Actor Sonu Sood: బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ మ‌రోసారి త‌న విత‌ర‌ణ‌ను చాటుకున్నారు. త‌న‌కున్న మాన‌వీయ కోణాన్ని నిరూపించుకున్నారు. టాలీవుడ్ న‌టుడు, దివంగ‌త‌ ఫిష్ వెంక‌ట్ కుటుంబానికి నేనున్నాను.. అంటూ ఆప‌న్న‌హ‌స్తం అందించారు. ఆ కుటుంబానికి ఆర్థిక‌సాయం అందించి అండ‌గా నిలిచారు. త‌న వంతు సాయంగా రూ.1.50 ల‌క్ష‌లు ఫిష్ వెంక‌ట్ కుటుంబానికి ఆర్థిక‌సాయం అంద‌జేశారు.

Actor Sonu Sood: ఇటీవ‌ల కిడ్నీ స‌మ‌స్య‌తో ఆసుప్ర‌తిలో చేరిన ఫిష్ వెంక‌ట్ చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఆ త‌ర్వాత ఫిష్ వెంక‌ట్ కుటుంబ స్థితిగ‌తులు తెలుసుకున్న సోనూసూద్ ఆర్థిక‌సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేర‌కు ఫోన్ ద్వారా ఫిష్ వెంక‌ట్ భార్య‌, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. వారి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం నూరిపోశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP Government: సినిమా పరిశ్రమ అభివృద్ధిపై AP ప్రభుత్వం ప్రత్యేక దృష్టి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *