Prashanth Kishor: ప్ర‌శాంత్ కిషోర్ ఫీజు ఎంతో తెలుసా?

Prashanth Kishor: పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ రాజ‌కీయ పార్టీల నుంచి వ‌సూలు చేసే ఫీజు విష‌యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఆయ‌న దేశంలో బీజేపీ స‌హా ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌కు వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేసి పెట్టారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ గెలుపు కోసం ప‌నిచేసిన ఆయ‌న ఎక్కువ స‌క్సెస్‌నే సాధించార‌ని చెప్పుకోవ‌చ్చు. అందుకే ఆయ‌న గెలుపు వ్యూహాల‌కు అంత ఖ‌రీద‌న్న మాట‌. అయితే పార్టీల‌కు ప‌నిచేసే విష‌యాన్ని ప‌క్క‌న బెట్టిన ఆయ‌న బీహార్‌లో సొంత పార్టీ పెట్టి ప్ర‌చారరంగంలో దూసుకుపోతున్నారు.

Prashanth Kishor: ఎవ‌రికో స‌ల‌హాలు ఇచ్చి వారిని గెలిపించ‌డ‌మేంది? నేనే గెలిస్తే పోలా? అని అనుకున్న‌ట్టున్నాడు ప్ర‌శాంత్ కిషోర్‌. అందుకే బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాల్గొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వ‌ర‌లో అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక కోసం బెల‌గంజ్‌లో జ‌రిగిన ఓ ప్ర‌చారం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఓ ప్ర‌శ్న ఎదురైంది. పార్టీని న‌డ‌ప‌డానికి మీకు డ‌బ్బు ఎక్క‌డిది? అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న బ‌దులుగా త‌న ఫీజు గురించి వివ‌రించారు.

Prashanth Kishor: ఒక్కో పార్టీకి వ్యూహ‌క‌ర్త‌గా తాను పనిచేస్తే రూ.100 కోట్ల‌కు పైగానే తీసుకుంటా.. అని ప్ర‌శాంత్ కిషోర్ అస‌లు విష‌యం వెల్ల‌డించారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో తాను స‌ల‌హాలు ఇచ్చిన పార్టీలే అధికారంలో ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు. చూశారా? ప్ర‌శాంత్ కిషోర్ కు అంత డిమాండ్ ఉంటుదా? అని ముక్కున వేలేసుకోవ‌డం జ‌నం వంత‌యింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *