Veeramallu Collections: హరిహర వీరమల్లు.. ఐదేళ్ల కిందట ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు కానీ, పవన్ ఫస్ట్ లుక్‌తో పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కానీ, నాలుగేళ్ల కిందట కీరవాణి బీజీఎమ్‌తో గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు కానీ ఉన్న క్రేజ్, అంచనాలు… సినిమా రిలీజ్ అయ్యేనాటికి లేనే లేవు. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లుగా మళ్లీ ఈ సినిమాకి ప్రాణం లేసొచ్చింది మాత్రం కీరవాణి మ్యూజికల్ మ్యాజిక్‌తో రిలీజ్ అయిన ట్రైలర్ వల్లే. అదే ఊపును కొనసాగించేందుకు స్వయానా పవన్ కళ్యాణే పూనుకుని, తన 28 ఏళ్ల సినిమా కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రెస్మీట్లు కండక్ట్ చేశారు. స్వయంగా పవన్ కళ్యాణే రంగంలోకి దిగి చేసిన ప్రమోషన్ వల్ల.. ప్రీమియర్ షోలతో సహా, వీకెండ్‌తో పాటూ, తొలి నాలుగు రోజుల బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా జరిగిపోవడంతో చాలా థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశాయి.
ఇక తొలి రోజు గ్రాస్ వసూళ్లు… 65 కోట్ల నుండి 75 కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి సినీ వర్గాలు. ఎలాగో రెండో రోజు శుక్రవారం కూడా ఫ్యాన్స్‌తో థియేటర్లు నిండిపోతాయి. శని, ఆదివారాలు ఫ్యాన్స్‌తో పాటూ ఫ్యామిలీస్ థియేటర్లకి తరలివస్తే, ఓటీటీ రైట్స్ కలుపుకుంటే, హరిహర వీరమల్లు సినిమా ఢోకా లేకుండా సేఫ్ జోన్లోకి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఐదేళ్లుగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారులే కానీ… అద్భుతాలు జరిగిపోతాయన్న అంచాలు ఎవ్వరూ పెట్టుకోలేదు. అందరి హోప్ తర్వాత రాబోయే ఓజీ పైనే ఉంది. అందుకే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఓజీ నినాదాలే వినబడ్డాయి. పవన్ కళ్యాణ్ కూడా.. సినిమాకి ప్రమెషన్ చేశారు కానీ, ఎక్కడా ఈ సినిమా రికార్డులు బద్ధలు కొడుతుందని కానీ, భారీ కలెక్షన్ల రాబడుతుందని కానీ మాట్లాడలేదు. దానికి బదులు… ‘సినిమా మీకు నచ్చిందా.. బద్దలు కొట్టేయండి’ అని మాత్రమే ఫ్యాన్స్‌కి చెప్పారు. పవన్ చెప్పినట్లే బద్ధలు కొట్టి చూపించారు వీరమల్లు ఫ్యాన్స్.
Also Read: Ashok Gajapathi Raju: నేడు గోవా కి నారా లోకేష్.. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
హరిహర వీరమల్లు డైరెక్టర్ చేసింది సుకుమార్, రాజమౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్టర్లు కాదు. మొన్న రిలీజ్ అయిన కన్నప్ప, రిలీజ్ కాబోతున్న కూలీ సినిమాల్లో లాగా… ఇండస్ట్రీకి ఒక హీరోని ఈ హరిహర వీరమల్లు సినిమాలో ఇంక్లూడ్ చేయలేదు. నేషనల్ క్రష్ రష్మికా కానీ, బాలీవుడ్ నుంచి జాన్వీ, అలియా భట్లు కానీ లేరు. పైగా అభిమానులే పెద్దగా అంచనాలేమీ పెట్టుకుని కూర్చోలేదు. అయినా సరే… ప్రీమియర్స్‌తో హైయెస్ట్ గ్రాస్ రికార్డ్, ఫస్ట్ డే కలెక్షన్స్‌లో పవన్‌కళ్యాణ్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిందంటే…. ఈ క్రెడిట్ అంతా గత నాలుగు రోజులుగా బీభత్సంగా పోస్టులు, ఎడిట్లు పెట్టి, ప్రొడ్యూసర్స్ కంటే ఎక్కువ పబ్లిసిటీ చేసి, సినిమాని మారుమూలనున్న సామాన్య ప్రేక్షకుల దాకా తీసుకెళ్లిన పేటీఎమ్ బ్యాచ్ అండ్ వైసీపీ లీడర్స్దే అంటున్నారు సినీ విశ్లేషకులు. స్వయంగా వైసీపీ సొంత చానల్లో రోజంతా లైవ్ డిబేట్లు నడిచాయి. దానికి తోడు సినిమాలో ఎక్కడ బొక్కలు వెతకాలో, ఎలా తప్పుబట్టాలో, ఎలా నెగటివ్ ట్రోలింగ్ చేయాలో, వందల కొద్ది యూట్యూబ్ చానల్స్‌కి స్క్రిప్ట్‌తో పాటూ మనీ కవర్లు కూడా వెళ్లిపోయాయట. ఇక టీవీల్లో రోజూ కనిపించే వైసీపీ విశ్లేషకులు హరిహర వీరమల్లు గురించి తప్ప మరో సబ్జెక్ట్ మాట్లాడటం లేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఏకంగా సినిమా చూడకుండానే రివ్యూ చేసిపడేశారు. ఒక మాజీ మంత్రిని సినిమా రివ్యూ చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చావంటే… పవనేశ్వరా, నువ్వు మామూలోడి కాదు బాస్.. అంటూ ఫ్యాన్స్ దిల్ ఖుస్ అవుతున్నారు.
పవన్ ఫ్యాన్స్‌కి ఒక లక్షణం ఉంది. తమ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ సినిమా బాగోలేదంటే… హర్ట్ అవుతారు, సినిమా చూసి సైలెంట్‌గా వెళ్లిపోతారేమో కానీ… ఇలా పనిగట్టుకుని కుట్రలు, నెగటివ్ ట్రోలింగ్‌తో రెచ్చగొట్టారో… తాడే పేడో తేల్చుకునే దాకా వదలరు. రిపీటెడ్‌గా థియేటర్లకి పోటెత్తి కనక వర్షం కురిపిస్తారు. వకీల్‌సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు జరిగింది అదే. హరిహర వీరమల్లు విషయంలోనూ జరుగుతోందీ అదే. యాంటీ ఫ్యాన్స్, పేటీఎమ్ బ్యాచ్ రాళ్లు విసిరితే… అవి ప్రొడ్యూసర్ రత్నంకి రత్నాల్లా మారుతున్నాయి. నెగటివ్ టాక్‌లోనూ ఈ సినిమా 200 కోట్లు ఎలాగైనా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రొడ్యూసర్ రత్నంకి ఇది ఒక బొనాంజ అయితే… మరో బొనాంజ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కలిసి వస్తుండటం. స్వయానా డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు కాబట్టి.. ఆయనకు చైర్మన్ పదవి లాంఛనమే. మొత్తానికి ఎవరి ఏడుపులూ వెండితెరపై ఆ ‘ఆంధీ’ని ఆపలేకపోయాయి అనమాట.