Chandrababu

Chandrababu: పెట్టుబడులే లక్ష్యం.. సింగపూర్కు సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ పర్యటనకు బయలుదేరుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి, అమరావతి రాజధాని ప్రాజెక్టు వంటి అంశాలపై ఈ పర్యటనలో కీలక చర్చలు జరగనున్నాయి.

బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లక్ష్యం

“బ్రాండ్ ఏపీ”ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడం, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం చంద్రబాబు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నవంబరులో విశాఖపట్నంలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.

సింగపూర్‌తో సంబంధాల పునరుద్ధరణ

అమరావతి రాజధాని అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం మళ్లీ చర్చకు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. సింగపూర్‌తో ఉన్న వ్యాపార, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.

ఇది కూడా చదవండి: Varun Tej: కన్ ఫ్యూజన్ లో వరుణ్ తేజ్.. పుట్టబోయే బేబీ కోసం..

మంత్రులు, ఉన్నతాధికారుల బృందం

చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, టీజీ భరత్ తదితరులు సింగపూర్ పర్యటనలో పాల్గొంటున్నారు. ఏడు మంది సభ్యులతో కూడిన ఈ బృందం ఆరు రోజులపాటు సింగపూర్‌లో పర్యటించనుంది.

పారిశ్రామికవేత్తలతో సమావేశాలు

సింగపూర్‌లో ప్రముఖ కంపెనీల యాజమాన్యాలు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం సమావేశాలు జరుపనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై వారికి వివరాలు అందించనున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana Rains: తెలంగాణలో 13 నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *