AP News: గత ఎన్నికలకు ముందు జరిగిన ‘సిద్ధం’ సభలో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించిన కేసులో దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరుడు చల్లగోళ్ళ తేజను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో ఏలూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
వైసీపీ యువజన అధ్యక్షుడు నానితో పాటు మరో యువకుడు అరెస్ట్
పోలీసులు తేజతో పాటు వైసీపీ ఏలూరు జిల్లా యువజన అధ్యక్షుడు కామిరెడ్డి నాని, అలాగే మరో యువకుడు చల్లగోళ్ళ ప్రదీప్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ‘సిద్ధం’ సభలో చోటుచేసుకున్న ఘర్షణల కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.అరెస్ట్ అనంతరం, ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయవాదుల వాదనలు కొనసాగుతున్నాయని సమాచారం. కోర్టు ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.