దేవరకు.. ఏపీలో స్పెషల్‌ షోలకు అనుమతి

ఎన్టీఆర్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం దేవర. జాన్వీకపూర్‌ హీరోయిన్ గా నటించగా.. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 27నఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక షోలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కలిపించింది. టికెట్‌ ధరలు, స్పెషల్‌ షోల విషయంపై ఇటీవల దేవర టీమ్‌ ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించగా.. తాజాగా దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ జీవో విడుదల చేసింది. రిలీజ్ రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు అనుమతిచ్చింది. సెప్టెంబర్‌ 28వ తేదీ నుంచి ఐదు ఆటలకు పర్మిషన్‌ ఇచ్చింది. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఫుల్ క్రేజ్ తీసుకువచ్చాయి. మరోవైపు దేవర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. ఎల్లుండి హైదరాబాద్‌లోని నోవాటెల్ HICCలో ఈవెంట్ జరుగుతుందని మూవీ టీమ్ ట్విటర్‌లో ప్రకటించింది. ‘భయమంటే ధైర్యం ఉన్నవారి కోసమే కాదు, అదో వేడుక కూడా. పెద్ద పండుగకు తొలి అడుగు సెప్టెంబర్‌ 22న పడుతోంది. మాస్ జాతరను కలిసి స్వాగతిద్దాం’ అని పోస్ట్ చేసింది. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు టాప్ డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ హాజరవుతారని చర్చ సాగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  CM Chandrababu: మీ ఇంటికి పెద్దకొడుకుగా ఉంటా..ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *