Lokesh Kanagaraj: రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ అందరూ నటిస్తున్న కూలి సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే ఐడియా ఎలా వచ్చిందో చెప్పాడు లోకేష్ కనకరాజ్. విక్రమ్ సినిమా సెట్స్ మీదకెళ్లేముందు కోవిడ్ కారణంగా వచ్చిన గ్యాప్ లో.. ఖైదీలో పోలీస్ క్యారెక్టర్ లాంటిది ఇందులోనూ రావడం.. అసలు ఆ మూవీలో క్యారెక్టర్ నే ఇందులో క్రాస్ ఓవర్ చేస్తే బాగుంటుంది కదా అనుకోవడం.. ఆ ఒక్క క్యారెక్టరే కాదు, అన్ని క్యారెక్టర్లనూ క్రాస్ ఓవర్ చెయ్యాలనే ఆలోచనతోనే ఈ ఎల్ సీ యూ పుట్టిందని చెప్పాడు.
