Goa:మ‌ళ్లీ విమానానికి బాంబు బెదిరింపు.. అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌

Goa:విమానాల‌కు బాంబుల బెదిరింపు కాల్స్ వ‌స్తూనే ఉన్నాయి. చెన్నై నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చే విమానాల‌కు, ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరే విమానాల‌కు ఇటీవ‌లే బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. అవి ఫాల్స్ కాల్స్ అని అధికారులు తేల్చారు. గ‌డిచిన 20 రోజుల్లోనే 510కి పైగా విమానాల‌కు బాంబు బెదిరింపు కాల్స్ రావ‌డం గ‌మ‌నార్హం. మ‌ళ్లీ తాజాగా ఆదివారం గోవా నుంచి క‌ల‌క‌త్తా వెళ్తున్న ఇండిగో విమానానానికి బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. దీంతో ఆ విమానాన్ని హైద‌రాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేశారు.

Goa:గోవా నుంచి క‌ల‌క‌త్తా వెళ్లే విమానంలో 180 మంది ప్ర‌యాణికులు ప్ర‌య‌ణిస్తున్నారు. ఆ ప్ర‌యాణికులంద‌రినీ ఎయిర్ పోర్ట్‌లో కిందికి దించేశారు. విమానంలో ఎయిర్ పోర్ట్ భ‌ద్ర‌తా సిబ్బంది త‌నిఖీలు చేస్తున్నారు. ప్ర‌యాణికులంతా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఆల‌స్యం.. కుంభ‌మేళా భ‌క్తుల‌కు ఆటంకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *