Road Accident: కారు ప్రయాణం హాయిగా సాగుతుంది.. ఇంతలో కారు తోలుతున్న వ్యక్తిని నిద్రా దేవత ఆవరించింది. ఇంకే ముంది ఎంచక్కా అమాంతం ఎగిరిపోయి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటి ప్రహరీపై స్ట్రైట్‌గా నిలిచే ఉన్నది. నిద్ర మత్తు వీడగానే ఆ వ్యక్తి కండ్లు బైర్లు కమ్మాయి. పోలీసులు వచ్చేంత వరకూ ఆ కారు గోడపైనే ఉన్నది. అయితే కొందరు నెటిజన్లు దాని వీడియో తీసి పోస్టులు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
Road Accident: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శంభీపూర్ గ్రామంలో కారు ఇలా బీభత్సం సృష్టించింది. కారు నడిపే వ్యక్తి నిద్ర మత్తులో ఉండటంతో అది కాస్తా ఓ ఇంటి గోడపైకి ఎక్కి ఇలా నిలిచిపోయింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఓ క్రేన్ సాయంతో కారును కిందికి దించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పేలుస్తున్నారు.