Ivana: టాలీవుడ్‌లో కొత్త సంచలనంగా మారుతోంది యువ నటి ఇవానా. ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మాయి, ‘సింగిల్’ సినిమాతో మరో హిట్ కొట్టింది. తన ఫ్రెష్ లుక్, నటనతో యువతలో క్రేజ్ సంపాదించిన ఇవానా.. హైట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “నటనకు హైట్ అడ్డంకి కాదు, రష్మికా మందన్నా దీనికి ఉదాహరణ” అంటూ చెప్పుకొచ్చింది. కేవలం 5 అడుగుల ఎత్తు ఉన్నప్పటికీ, కెమెరా టెక్నిక్‌లతో దాన్ని సమర్థవంతంగా కవర్ చేయవచ్చని ఆమె అభిప్రాయం.
Also Read: War 2 Trailer: వార్ 2 ట్రైలర్ అదిరింది: యాక్షన్ ప్రియులకు పండుగే!
ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఇవానా.. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో కొత్త సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. స్టార్ హీరోలతో జోడీ కట్టే అవకాశాలు కూడా దక్కించుకునేందుకు ఆమె రెడీ. ఈ యువ నటి ఫ్యూచర్ లో టాలీవుడ్‌లో ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి!