Mandipalli Bros on Fire

Mandipalli Bros on Fire: ఆ మంత్రి వైల్డ్ ఫైర్.. వైసీపీ మాజీకి 33 సార్లు ఫోన్‌

Mandipalli Bros on Fire: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసు వైసీపీ అండ్‌ కోని ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. వైసీపీని మూసేయడానికి ఈ ఒక్క కేసు చాలని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో డిస్కషన్‌ నడుస్తోంది. సిట్‌ దర్యాప్తు క్రమంలో ఒక క్రమ పద్ధతిలో జరిగిన లీకులు, వాటి తాలూఖా పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాలతో లిక్కర్‌ స్కామ్‌ గురించి ప్రజలకు సుస్పష్టంగా తెలిసిపోయింది. ఇప్పుడు ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు ఎవరని అడిగితే.. 5వ తరగతి విద్యార్థి కూడా బిగ్‌బాస్‌ పేరే చెబుతాడు. ఇక ఎంపీ మిధున్‌ రెడ్డి అరెస్ట్‌తో జాతీయ మీడియాలో సైతం ఏపీ లిక్కర్‌ స్కామ్‌ సంచలనం అయి కూర్చుంది. మిధున్‌ రెడ్డి అరెస్టు వద్దే ఈ కేసు ఆగే పరిస్థితి కనబడం లేదు. ఇంకో ఇద్దరు కీలక వ్యక్తుల అరెస్టుతో పాటూ, బిగ్‌బాస్‌ అరెస్టుకు పకడ్భంధీగా సిట్‌ ఏర్పాట్లు చేస్తోందని టాక్‌ వినిపిస్తోంది. ఈ కేసులో ఇన్వాల్మెంట్‌ ఉండి విదేశాల్లో దాక్కున్న వారిని సైతం వదిలే పరిస్థితి లేదట. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను చూస్తే… దేశం వదిలి పాయిపోయి దుబాయ్‌, థాయ్‌ల్యాండ్‌లో తలదాచుకున్న 8 మందిని సిట్‌ గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో అధికారులు, కీలక వైసీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. వీరికి రెడ్‌ కార్నర్‌ నోటీసుల జారీకి రంగం సిద్ధమైంది. ఇంటర్‌పోల్ ద్వారా వీరిని భారత్‌కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విదేశాంగ శాఖకు లేఖ కూడా రాశారట సిట్ అధికారులు.

ఇక ఏపీ లిక్కర్‌ స్కామ్‌ సైజు, పరిధిని బట్టి చూస్తే.. దేశంలోనే ఇలాంటి స్కామ్‌ ఎక్కడా జరలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈడీ, సీబీఐ చేతికి ఈ కేసు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఏపీ లిక్కర్‌ స్కాం.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కంటే పది రెట్లు పెద్దది. లిక్కర్ పాలసీ నుంచి సరఫరా వరకు భారీగా మనీలాండరింగ్‌ జరిగింది. వేల కోట్ల రూపాయలు దేశం దాటాయంటోంది సిట్‌. మనీల్యాండరింగ్‌ కేసు కాబట్టి ఈడీ వదిలే ప్రసక్తే లేదని ప్రచారం జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్ కేసులో అరేడుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసింది ఈడీ. మాజీ సీఎం భూపేష్ భాగల్ కుమారుడు చైతన్య భాగల్‌ని సైతం ఈడీ అరెస్టు చేసింది. ఇక ఢిల్లీ లిక్కర్‌స్కాంలో సీఎం, డిప్యూటీ సీఎంల అరెస్టులు జరిగాయి. అంటే… ఈడీ రంగంలోకి దిగితే తాట తీయడం ఖాయం. ఈడీ మాత్రమే కాదు.. సీబీఐ దర్యాప్తు జరపాల్సిందేనని మరో డిమాండ్‌ వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన వైసీపీ లిక్కర్‌ పాపం పండినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ALSO READ  KRM Mayor Seat Heat: ఆ మేయర్‌ సీటు కోసం రేవంత్‌ పట్టుబడుతున్నారా?

Also Read: Chandrababu Naidu: 26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన

సరిగ్గా ఓ నాలుగు నెలల క్రితం… అంటే మార్చి నెల ముందు వరకూ… లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తు అనేది కేవలం వార్తల్లో మాత్రమే కనిపించేది. చంద్రబాబు సిట్‌ వేశామన్నారు కానీ.. సిట్‌ ఏం చేస్తోంది? ఎలాంటి వివరాలు సేకరిస్తోంది? ఎవరెవర్ని కార్నర్‌ చేసింది? అన్న వివరాలు పెద్దగా తెలిసేవి కాదు. అయితే మార్చి నెలలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈ లిక్కర్‌ స్కామ్‌ని లేవనెత్తి అనూహ్యంగా ఎంపీ మిధున్‌ రెడ్డి సహా, ఇతర వైసీపీ నేతల ప్రమేయంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ దెబ్బకు పార్లమెంట్ షేక్‌ అవ్వడంతో పాటూ.. స్వయానా అమిత్‌ షా.. టీడీపీ ఎంపీని తన వద్దకు పిలిపించుకుని లిక్కర్‌ స్కామ్‌ వివరాలు ఆరా తీశారని ప్రచారం జరిగింది. అక్కడి నుండి మిధున్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం కోర్టుల చుట్టూ తిరగడం, రాజ్‌ కసిరెడ్డి నుండి మొదలు పెట్టి సుమారు డజను మంది అరెస్టులు జరగడం.. నేడు ఈడీ, సీబీఐ దాకా కేసు తీవ్రత పెరగడం చోటు చేసుకుంది. వైసీపీ… లావు కృష్ణదేవరాయలను అవమానించి పార్టీ నుండి బయటకు వెళ్లేలా చేసింది. ఆయన టీడీపీలో చేరి ఎంపీ అయ్యారు. ఆ అక్కసుతో లావుపై వైసీపీ ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది. విడదల రజనీ ఏకంగా తన ఫోన్‌ ట్యాప్‌ చేయించాడంటూ ఎంపీ లావు కృష్ణదేవరాయలుపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో లావు కృష్ణదేవరాయలు వైసీపీని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. ఢిల్లీలో నిప్పు రాజేస్తే.. బ్లాస్ట్‌ తాడేపల్లిలో అయ్యిందనమాట.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *