Wedding Dates: ఈ నెల 25వ తేదీ (జులై 25, 2025) నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా, శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో అనేక శుభకార్యాలు, పూజలు, వ్రతాలు నిర్వహించడానికి మంచి ముహూర్తాలు ఉంటాయి.
శ్రావణ మాసం వివాహాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు వంటి శుభకార్యాలకు చాలా అనుకూలమైనది. జూలై 25 నుండి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో, ఈ నెల 26, 30, 31 తేదీలతో పాటు ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో శివ కేశవులను, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం.
శ్రావణ మాసం 2025 ముఖ్య తేదీలు:
• ప్రారంభం: జూలై 25, 2025 (శుక్రవారం)
• ముగింపు: ఆగస్టు 23, 2025 (శనివారం)
ఇది కూడా చదవండి: AP New Districts: ఏపీలో తెరపైకి కొత్త జిల్లాలు..చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతుంది?
శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు, శుభముహూర్తాలు:
• మొదటి శ్రావణ శుక్రవారం: జూలై 25, 2025
• నాగ పంచమి: జూలై 29, 2025 (మంగళవారం)
• వరలక్ష్మీ వ్రతం: ఆగస్టు 8, 2025 (శుక్రవారం)
• రాఖీ పౌర్ణమి (శ్రావణ పౌర్ణమి): ఆగస్టు 9, 2025 (శనివారం)
• శ్రీకృష్ణాష్టమి: ఆగస్టు 16, 2025 (శనివారం)
శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైనదే. మహిళలు సుమంగళీగా జీవించే వరం ఇవ్వమంటూ.. తమ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలకు, సిరి సంపదల కోసం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు.
అయితే వరలక్ష్మి వ్రతం పున్నమికి మందు వచ్చే శుక్రవారం మరింత ఫలవంతం అని భావిస్తారు. ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం శుక్రవారం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. ఆగస్టు 1,15, 22 తేదీల్లో కూడా వరలక్ష్మీవ్రతం జరుపుకోవచ్చు.