Cm chandrababu: వ్యవసాయంపై AI సర్వే

Cm chandrababu: రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రాధాన్య రంగంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర చర్యలు చేపట్టారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై నాలుగు గంటలకు పైగా లోతైన చర్చ జరిగింది.

శాటిలైట్ సర్వేతో ఖచ్చితమైన డేటా

తూర్పుగోదావరి జిల్లా భలభద్రాపురంలో చేపట్టిన శాటిలైట్ సర్వే ద్వారా సమగ్ర సమాచారం లభించిందని సీఎం తెలిపారు. ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని డేటాతో సరిపోల్చాలని, ఒకే ప్రాంతంలో ఒకే రకం పంటలకు రైతులకు మార్గదర్శకత్వం అవసరమని చెప్పారు. రైతు సేవా కేంద్రాల ద్వారా మద్దతు అందించాలని, ల్యాండ్ రీసర్వే తర్వాత వ్యవసాయ, రెవెన్యూ రికార్డులు అప్డేట్ చేయాలని సూచించారు.

జలవనరుల సద్వినియోగం

సాగునీటి సమస్యలు నివారించేందుకు అన్ని కాలువల ద్వారా నీటిని చివరి ఆయకట్టు వరకు చేరేలా చూడాలని సీఎం ఆదేశించారు. నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా గుంటూరు ప్రాంతానికి నీరు విడుదల చేయాలని తెలిపారు. సాగునీటి సంఘాలతో త్వరలో వర్చువల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఏఐ చాట్‌బోట్‌తో సాంకేతిక సాయం

పంటల ప్రణాళిక, విలువ జోడింపు, సాంకేతిక సహాయం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బోట్‌ను ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు. ఇప్పటికే 47.41 లక్షల మంది రైతులు ‘అన్నదాత సుఖీభవ’ ఈ-కేవైసీ పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. “ఇ-పంట” ద్వారా అర్హులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు.

ప్రకృతి సేద్యం, ఎగుమతుల పై దృష్టి

రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూసారం తగ్గుతున్న నేపథ్యంలో ప్రకృతి సేద్యం, ఆర్గానిక్ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ కల్పించి జపాన్, తైవాన్ వంటి దేశాలకు ఎగుమతులను పెంచే దిశగా టాటాతో ఒప్పందం కుదుర్చనున్నట్లు తెలిపారు. అలాగే డ్రోన్లు, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని చెప్పారు.

మొబైల్ రైతు బజార్లు, సూక్ష్మ సాగు ప్రోత్సాహం

నగరాల్లో అపార్ట్‌మెంట్ల వద్ద మొబైల్ రైతు బజార్ల ఏర్పాటు చేయాలని, 30 రోజుల్లో కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. సూక్ష్మ సాగు ద్వారా ఉద్యాన పంటలను విస్తరించాలని, రాయలసీమలో మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలని సూచించారు.

మత్స్య, పశుసంపద రంగాల్లో పురోగతి

మత్స్యకారులకు సముద్ర మత్స్యవనరుల సమాచారం యాప్ ద్వారా అందేలా చూడాలని, సీవీడ్ సాగును ప్రోత్సహించాలని సీఎం పేర్కొన్నారు. ఆక్వా ఉత్పత్తుల్లో నాణ్యతకే ప్రాధాన్యత ఇవ్వాలని, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించే వారికి సబ్సిడీలు ఇవ్వాలన్నారు. పశుసంపద రంగంలో 15% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ALSO READ  Shiva Rajkumar: ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా..!?

‘కోకో ముంజ్’కు సీఎం ప్రశంస

కొబ్బరితో తయారు చేస్తున్న ‘కోకో ముంజ్’ సంస్థ ఉత్పత్తులను పరిశీలించిన సీఎం, సంస్థ ప్రతినిధిని అభినందించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *