ఏపీ డిప్యూటీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఓజీ, హరహరవీరమల్లు, ఉత్సాద్ భగత్ సింగ్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో చిత్రానికి పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఆ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు తాజాగా పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ప్రముక నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. త్వరలోనే ఓ స్టార్ హీరోతో పొలిటికల్ మూవీ ప్లాన్ చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. 2029 ఎలక్షన్స్‌కు ముందే ఈ సినిమా రావొచ్చు అని తెలిపారు. ఇక అప్పటినుండి పవన్-త్రివిక్రమ్ కాంబోపై సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. బాలయ్యతో డౌటే కానీ, పవన్‌తో మాత్రం ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. త్రివిక్రమ్, పవన్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే.
ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, త్రివిక్రమ్ ఫ్యామిలీ మెంబర్. కాబట్టి.. ఖచ్చితంగా 2029 ఎన్నికలు టార్గెట్‌గా పవర్ స్టార్‌తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ మొదలైంది. ఈలోపు త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్‌లో చేరనున్నారు. పవన్–త్రివిక్రమ్ కాంబో ఇప్పటికే జల్సా, అజ్ఞాతవాసి చిత్రాలు వచ్చాయి. ఇందులో జల్సా సూపర్ హిట్ కాగా.. అజ్ఞాతవాసి డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరో మూవీ వస్తే.. సునామీ సృష్టించడం గ్యారెంటీ.