Rashmika: పర్ఫ్యూమ్ బిజినెస్‌లోకి రష్మిక.

Rashmika: నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న వరుస హిట్లతో కెరీర్‌లో దూసుకుపోతోంది. సినిమా సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త రంగాన్ని టచ్ చేసింది. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.

ఇప్పటికే సమంత, నయనతార లాంటి టాప్ హీరోయిన్లు బిజినెస్ రంగంలో తమదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్మిక కూడా అదే బాటలో నడుస్తూ, ‘పర్ఫ్యూమ్ బిజినెస్’*లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘డియర్ డైరీ’ అనే పేరుతో సొంత పర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా ‘‘ఒక మంచి వార్త చెప్పబోతున్నా’’ అంటూ సోషల్ మీడియాలో హింట్ ఇస్తూ వచ్చిన రష్మిక.. చివరికి ఈ బిజినెస్ ప్రకటనతో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది.

ఈ బ్రాండ్ తన కోసం ప్రత్యేకమైనదని, ఇది తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. ‘డియర్ డైరీ’ పర్ఫ్యూమ్ బాటిల్స్ ధరలు రూ.1600 నుంచి రూ.2600 వరకు ఉండనున్నాయి.

ఇక సినిమా విషయానికి వస్తే.. రష్మిక ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మైసా’ చేస్తోంది. అంతేకాకుండా, ఇటీవల ‘కుబేర’ చిత్రంతో మంచి విజయం అందుకుంది. మరోవైపు, రెండు భారీ పాన్-ఇండియా ప్రాజెక్టుల్లోనూ ఆమె నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.

సినిమాల్లో విజయాలతో పాటు వ్యాపార రంగంలోనూ రష్మిక ఎంతవరకు రాణిస్తుందో వేచి చూడాలి!

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  home minister anita: 100 మందికే సెక్యూరిటీ ఇవ్వగలమని ముందే చెప్పాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *