Aircraft: బంగ్లాదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శిక్షణలో ఉన్న ఒక మిలిటరీ విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఢాకాలోని ఓ కాలేజీ భవనంపై ఈ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
విమానం కుప్పకూలిన సమయంలో కాలేజీలో విద్యార్థులు, సిబ్బంది ఉన్నారని సమాచారం. అయితే వారి పరిస్థితిపై ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై బంగ్లాదేశ్ మిలిటరీ దర్యాప్తు ప్రారంభించింది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.