Congress: ఒడిశా రాష్ట్రంలో సంచలనంగా మారిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భువనేశ్వర్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన కేసులో ఒడిశా NSUI (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ (Udit Pradhan)ను పోలీసులు అరెస్టు చేశారు.
ఎలా జరిగింది ఘటన?
మార్చి 2025లో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదిత్ ప్రధాన్ యువతిని విందు కోసం తన ఇంటికి ఆహ్వానించాడు.దింతో ఆమె అక్కడికి వచ్చింది. అదే అదునుగా చేసుకొని ఆమెకు తెలియకుండా పానీయంలో నిద్రమాత్రలు కలిపాడు. ఆ కలిపినా డ్రింక్ ని ఆమెకి ఇచ్చి తాగమనాడు అది తగినతర్వాత యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ స్థితిలోనే ఉదిత్ ప్రధాన్ ఆమెపై అత్యాచారం చేశాడు. మెలుకువ వచ్చినతర్వాత ఈ విషయం పైన నిలదీయగా ఇక్కడ జరిగిన ఎవరికైన చెప్పుతే చంపేస్తానని బెదిరించాడు.
ఇది కూడా చదవండి: Vangalapudi Anitha: పక్కా ఆధారాలతోనే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్.. అక్రమ అరెస్ట్ కాదు!
తర్వాత ఏం జరిగింది?
కొంతకాలం భయంతో మౌనం వహించిన బాధితురాలు చివరికి ధైర్యం తెచ్చుకొని మంచేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న రాత్రి ఉదిత్ ప్రధాన్‌ను అరెస్టు చేశారు. “సోమవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరుస్తాం” అని భువనేశ్వర్ డీసీపీ జగ్మోహన్ మీనా తెలిపారు.
రాజకీయంగా సంచలనం
విద్యార్థులకు అండగా నిలబడాల్సిన విద్యార్థి నాయకుడు ఇలా వ్యవహరించడం పట్ల ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలపై పెరుగుతున్న దాడులపై బిజెడి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఘటన భారీ దెబ్బగా మారింది.

