Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం “హరి హర వీరమల్లు” ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఎ.ఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రానికి ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ – రత్నం కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
రిసెంట్‌గా సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. పోడియం లేకుండా మాట్లాడుతుంటే నాకు నగ్నంగా ఉన్నట్టుంది. చాలా కాలం తర్వాత సినిమా మీడియాతో మాట్లాడుతున్నాను. పొలిటికల్ ప్రెస్ మీట్స్‌లో పాల్గొన్నా కానీ సినిమా కోసం మీడియాతో మాట్లాడటం చాలా అరుదు. నిజం చెప్పాలంటే నేను యాక్సిడెంటల్ యాక్టర్‌ను. సినిమాలలోకి రావడం గత్యంతరం వల్లే. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకంటే మా నిర్మాత రత్నం గారి కోసమే. సాయంత్రం ఈవెంట్ ఉన్నా కూడా ఇప్పుడు మీడియాతో మాట్లాడకపోతే మళ్ళీ అవకాశం దొరకదని అనిపించింది,” అన్నారు.
ఇది కూడా చదవండి: Mirai : మిరాయ్ బిగ్ బిజినెస్ సంచలనం!
“రీజనల్ సినిమాలను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన నిర్మాతల్లో రత్నం గారు ముందువరుసలో ఉంటారు. సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన వ్యక్తి రత్నం. ఈ సినిమా చాలా కష్టాలు ఎదుర్కొంది. పాలిటిక్స్ వల్ల సినిమాలకు దూరమయ్యాను కానీ రత్నం గారు అడిగినప్పుడు మళ్ళీ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఉన్న పరిస్థితుల్లో టైమ్ ఇవ్వలేకపోయినా ఈ సినిమా క్లైమాక్స్ కోసం 57 రోజులు కేటాయించాను. నా వంతు సపోర్ట్‌ను పూర్తి స్థాయిలో ఇచ్చాను,” అని పవన్ తెలిపారు.
ఈ మాటలతో పవన్ కళ్యాణ్ “హరి హర వీరమల్లు” సినిమాపై తనకున్న అంకితభావాన్ని స్పష్టంగా చూపించారు. ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక భారీ విజువల్ ఫీస్ట్‌గా మారుతుందని ఆయన మాటలతోనే తెలుస్తోంది.