Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: ఆర్టీఐ కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు చోటు లేదా

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎక్స్ (Twitter) వేదికగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కవిత ట్వీట్ ప్రకారం
✔️ ఇప్పటికే నియమించిన చీఫ్ కమిషనర్, నలుగురు కమిషనర్లలో ఒక్కరు కూడా బీసీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వారు లేరని గుర్తుచేశారు.
✔️ కొత్తగా నియమించబోయే మరో ముగ్గురు కమిషనర్ల కోసం రూపొందించిన ప్రతిపాదనల్లో కూడా బీసీలు, ఎస్టీలకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.
✔️ జనాభా శాతం దృష్ట్యా, ఖాళీగా ఉన్న మూడు కమిషనర్ పోస్టులను బీసీలు, ఎస్టీలతో భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
✔️ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ఈ నిర్ణయమే దానికి నిదర్శనం అవుతుందని కవిత వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Mumbai Train Blast Case: బిగ్ బ్రేకింగ్… 2006 ముంబయి రైలు పేలుళ్లు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!

కవిత తరచూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆమె చేపడుతున్న ఈ పోరాటాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Summer Holidays 2025: స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చేశాయ్. ఎప్పటినుంచి ఎప్పటి వరకు అంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *