Lucky Bhaskar: ‘మహానటి, సీతారామం’ చిత్రాలతో వరుస విజయాలను తెలుగులోనూ అందుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’తో హ్యాట్రిక్ సాధించాడు. ఈ సినిమా దీపావళి కానుకగా గురువారం విడుదలై తొలి రోజున వరల్డ్ వైడ్ 12.7 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, రెండో రోజు శుక్రవారం దానిని మించి మెరుగైన వసూళ్ళు సాధించింది. రెండో రోజు నాటికి ఈ సినిమా 26.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. శని, ఆదివారాలు సైతం శలవు రోజులు కావడంతో ఇదే ఊపు కొనసాగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను సైతం అలరిస్తున్న ‘లక్కీ భాస్కర్’ ను వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

