Revanth Reddy: ఎట్టకేలకు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నగదు బహుమతిని తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం అందించింది.
రెండు సంవత్సరాల క్రితం, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఆ సమయంలో, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయలు ఇస్తానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.
ఇప్పుడు, బోనాల పండుగ సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంది. రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించి, మంజూరు చేసింది. దీనితో రాహుల్ సిప్లిగంజ్ అభిమానులు, తెలుగు సినీ లోకం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని పలువురు ప్రశంసిస్తున్నారు.

