Hansika: టాలీవుడ్, కోలీవుడ్‌లలో పాపులర్ హీరోయిన్ హన్సిక మోత్వానీ ప్రస్తుతం విడాకుల పుకార్లతో వార్తల్లో నిలుస్తున్నారు. వ్యాపారవేత్త సోహైల్ కతురియాతో 2022 డిసెంబర్ 4న జైపూర్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్న హన్సిక, పెళ్లి తర్వాత ప్రతి ఏడాది యానివర్సరీ సందర్భంగా ఫొటోలు షేర్ చేస్తూ వచ్చారు. గతేడాది సైతం సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టారు.
అయితే, ఇటీవల హన్సిక-సోహైల్ మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. హన్సిక ప్రస్తుతం తల్లితో కలిసి ఉంటోందని, సోహైల్ తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకోబోతున్నారన్న పుకార్లు మరింత వేగంగా వ్యాపించాయి.
ఇది కూడా చదవండి: Kapil Sharma: కామెడీ కింగ్ కపిల్ శర్మ: 500 జీతంతో 300 కోట్ల సామ్రాజ్యం!
సోహైల్ స్పందన – రూమర్లు తప్పుడు!
తాజాగా సోహైల్ కతురియా ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, విడాకుల వార్తలు పూర్తిగా తప్పుడువని స్పష్టం చేశారు. ఈ రూమర్లను తోసిపుచ్చినా, హన్సికతో కలిసి ఉంటున్నారా? వేరుగా ఉంటున్నారా? అనే ప్రశ్నకు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. హన్సిక కూడా ఇప్పటివరకు ఈ విషయంపై ఏ స్పందన ఇవ్వకపోవడం ఆసక్తికరంగా మారింది.
హన్సిక కెరీర్
2003లో బాలనటిగా సినీప్రస్థానం ప్రారంభించిన హన్సిక, 2007లో “దేశముదురు” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా తమిళంలో రౌడీ బేబీ, మ్యాన్, గాంధారి సినిమాలతో పాటు హిందీలో లవ్ ఎఫైర్ సినిమాలో నటిస్తున్నారు.
ఇక హన్సిక-సోహైల్ జంట నిజంగా విభేదాలు ఎదుర్కొంటుందా? లేక ఇది కేవలం పుకార్లేనా? అన్నది చూడాలి.
